Nara Bhuvaneswari : చంద్రబాబు పుట్టిన రోజు.. మంచి మనసు చాటుకున్న భువనేశ్వరి.. ఎంత గొప్ప నిర్ణయం
Nara Bhuvaneswari : నారా భువనేశ్వరి మంచి మనసు చాటుకున్నారు. భారీ విరాళం ప్రకటించారు.
On occasion of ap cm chandrababu naidu birth day nara bhuvaneshwari donates rs 76 lakh to anna canteens
Nara Bhuvaneswari : ఏప్రిల్ 20న నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ క్రమంలో ఆయన భార్య భువనేశ్వరి మంచి మనసు చాటుకున్నారు. భర్త పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడుపు నింపేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం భారీ విరాళం ప్రకటించారు. పేదల కడుపు నింపేందుకు భువనేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల కోసం రూ.76 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విరాళంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు. ఏప్రిల్ 20, సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్ డే. అందుకే భువనేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లు లక్షలాది పేదల కడుపు నింపుతున్నాయన్నారు. రూ.5కే పరిశుభ్ర వాతావరణంలో పేదలకు భోజనం పెడుతున్నట్లు తెలిపారు.
