Attack : గిరిజన యువతిపై దాడి.. రెండు రోజులు ఇంట్లో నిర్బంధించి
బాధితురాలు బంధువు అయిన మరో ఇద్దరు మహిళలను ఇంటికి పిలిపించి వారిపై కూడా దొంగతనం నేరాన్ని మోపేందుకు యజమాని రాజబాబు ప్రయత్నించాడు.

owner attacked young tribal woman
Owner Attacked Young Tribal Woman : కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేసిందన్న అనుమానంతో యజమాని గిరిజన యువతిని రెండు రోజులు ఇంట్లో నిర్బంధించి దాడికి పాల్పడ్డాడు. దొంగతనం చేసిందనే అనుమానంతో ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే గిరిజన యువతిపై యజమాని దాడి చేశాడు.
బాధితురాలు బంధువు అయిన మరో ఇద్దరు మహిళలను ఇంటికి పిలిపించి వారిపై కూడా దొంగతనం నేరాన్ని మోపేందుకు యజమాని రాజబాబు ప్రయత్నించాడు. యజమాని దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిపై జరిగిన దాడిని పట్టించుకోని మోపిదేవి ఎస్ ఐ తిరిగి బాధితురాలిపైనే దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు.
Assembly Elections 2023: బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కాగానే రాష్ట్ర అధ్యక్షుడి ఇంటిపై రాళ్ల దాడి
చేయని నేరాన్ని మోపడమే కాకుండా బాధితుల ఇళ్లను తగలబెట్టేస్తానని యజమాని రాజబాబు హెచ్చరించాడు. బాధితురాలు దుర్గతోపాటు ఆమె బంధవులైన పిన్ని పద్మ, అమ్మమ్మ రమణను తన ఇంటికి రప్పించుకున్న రాజాబాబు ముగ్గురిని రెండు రోజులు నిర్బంధించినట్లు ఆరోపిస్తున్నారు.
యజమాని చెర నుంచి తప్పించుకున్న బాధితులు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ సమాచారం తెలుసుకున్న అవని గడ్డ డీఎస్పీ మురళీధర్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలను సేకరించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.