Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్ వీడియో, బైక్ పైనుంచి ఎలా పడిపోయారో చూడండి..
గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదు రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రవీణ్ మృతి చెందారు.

Pastor Praveen : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కేసులో రోజుకో వీడియో వెలుగులోకి వస్తోంది. తాజాగా పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన ఇంకో వీడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఫుడ్ ప్లాజా హోటల్ దగ్గర ప్రవీణ్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి.
గత నెల 24న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మీదు రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రవీణ్ మృతి చెందారు. కేసు విచారణలో భాగంగా రాజమహేంద్రవరం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. ఫుడ్ ప్లాజా హోటల్ దగ్గర రోడ్డుపై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయినట్లు కెమెరాలో కనిపిస్తోంది.
అయితే, తృటిలో ఆయన ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. లారీ చక్రాల కింద పడబోయారు ప్రవీణ్. కొద్దిలో ఈ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ కెమెరాలో తెలుస్తోంది. ఆ తర్వాత ప్రవీణ్ అతి కష్టం మీద బుల్లెట్ బైక్ ఎక్కి ఆరుసార్లు కిక్ కొట్టినట్లు వీడియోలో ఉంది.