Pawan Kalyan: ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్.. ఇకపై ‘జీరో టాలరెన్స్’.. కింగ్పిన్ల పని ఖతం
ఎర్రచందనం అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రస్థాయిలో దృష్టి సారించారు.
Pawan kalyan declares zero tolerance policy on red sandalwood smuggling in ap
- ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమీక్ష
- కింగ్పిన్ల నిర్మూలనకు ఆదేశం
- డ్రోన్లతో పటిష్ట నిఘా
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అటవీ సంపద అయిన అమూల్యమైన ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా సమూలంగా అరికట్టేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. అమరావతిలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూటమి ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తుందని, అడవుల రక్షణలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
AP Pension Good News: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల ముందే పెన్షన్ల పంపిణీ
అంతర్రాష్ట్ర మూలాలపై కన్ను.. సాంకేతికతతో నిఘా:
కేవలం చెట్లు నరికే కూలీలపైనే కాకుండా, ఈ మాఫియా వెనుక ఉన్న అసలు కింగ్పిన్లు, ఫైనాన్షియర్ల మూలాలను తుడిచిపెట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఎక్కడ దాచినా ఎర్రచందనం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖలతో తక్షణమే సమన్వయం పెంచుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ అరికట్టేందుకు డ్రోన్లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించి నిఘాను పటిష్టం చేయాలన్నారు.
సమష్టి పోరాటంతోనే సంపద పరిరక్షణ:
మన రాష్ట్ర సహజ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పునరుద్ఘాటించిన డిప్యూటీ సీఎం, అన్ని శాఖలు సమష్టిగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలతో స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
