Pawan Kalyan: అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?
అమెరికాలో అదానీ కేసులో ఏపీలో గత ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై, ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా అనే విషయంపై మీడియా ప్రశ్నించగా పవన్ కల్యాణ్ స్పందించారు.

Pawan Kalyan
Adani Bribe Case : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన పవన్.. బుధవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపారు. బుధవారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ-వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలియజేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతోనూ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
Also Read: Dhanush – Nayanthara : నయనతార విషయంలో తగ్గేదేలే.. కోర్టుకెళ్లిన ధనుష్..
ప్రధానితో భేటీకి ముందు పవన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాలో అదానీ కేసులో ఏపీలో గత ప్రభుత్వానికి లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై, ఆ ఒప్పందాలను రద్దు చేస్తారా అనే విషయంపై మీడియా ప్రశ్నించగా పవన్ కల్యాణ్ స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని అన్నారు. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని, లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు.
అదేవిధంగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో జరిగే దాడులపై ఎందుకు స్పందించరు.. హిందువులపై జరుగుతున్న దాడులపై అందరూ స్పందించాలని పవన్ అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో. భారత్ లో ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.