Dhanush – Nayanthara : నయనతార విషయంలో తగ్గేదేలే.. కోర్టుకెళ్లిన ధనుష్..
తాజాగా ధనుష్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు.

Dhanush went to Court in Nayanthara Issue
Dhanush – Nayanthara : ఇటీవల ధనుష్ – నయనతార వివాదం బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. నయనతార లైఫ్ పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించగా అందులో ధనుష్ నిర్మాతగా చేసిన నేను రౌడీనే సినిమా కంటెంట్ ని ధనుష్ పర్మిషన్ ఇవ్వకుండానే వాడుకోవడంతో ధనుష్ 10 కోట్లు కట్టాలని లీగల్ నోటిస్ పంపించాడు. దీంతో నయన్ ధనుష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పబ్లిక్ గా ధనుష్ గురించి లెటర్ రాసింది.
దీంతో నయనతారపై నెటిజన్లు, ధనుష్ ఫ్యాన్స్ విమర్శలు చేసారు. నయనతార 3 సెకండ్స్ అని అబద్దం చెప్పి 30 సెకండ్స్ వాడుకుందని, తన లైఫ్ ని మాత్రం తాను డబ్బులకు అమ్ముకోవచ్చు కానీ ధనుష్ కంటెంట్ వాడుకుంటే డబ్బులు అడగొద్దా అంటూ నయనతారపై విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన ధనుష్ – నయనతార ఈ వివాదంతో శత్రువులుగా మారడమే కాక వీరి వివాదం తమిళనాట చర్చగా మారింది.
Also Read : Samantha : ‘ఆ వ్యాధి ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా’.. సమంత కామెంట్స్ వైరల్
అయితే ఈ విషయంలో ధనుష్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. తాజాగా దీనిపై ధనుష్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. నయనతారపై 10 కోట్ల దావా వేసాడు ధనుష్. ధనుష్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు స్వీకరించింది. దీంతో ఈ విషయం మరింత చర్చగా మారింది. మరి దీనికి నయనతార సమాధానమిస్తుందా? నయనతార ధనుష్ అడిగిన 10 కోట్లు కడుతుందా? లేక ధనుష్ లాగే తగ్గేదేలే అంటూ కోర్టులో పోరాడుతోందా చూడాలి.