అందుకే షర్మిల వాటాల గురించి రచ్చ జరుగుతోంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పార్టీలో ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

అందుకే  షర్మిల వాటాల గురించి రచ్చ జరుగుతోంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddy Ramachandra Reddy

Updated On : October 26, 2024 / 2:34 PM IST

ఎన్నికల ముందులాగే వైఎస్ షర్మిల ఇప్పుడు చంద్రబాబు నాయుడిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బెయిల్ రద్దు కోసమే షర్మిల వాటాల గురించి రచ్చ జరుగుతోందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసేందుకు షర్మిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని తెలిపారు.

పార్టీలో ప్రక్షాళన దిశగా వైసీపీ అడుగులు వేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంటు ఛార్జీలపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఛార్జీలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

వరదలకు కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ విషపూరిత ప్రచారం చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు, విత్తనాలు, క్రాప్ ఇన్సురెన్స్ చేశామని, నేడు రైతుల మీదకి నెట్టేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంకా అనేకచోట్ల పంపిణీ ప్రారంభించలేకపోయాం : మంత్రి రామానాయుడు