Nedurumalli Ramkumar Reddy : ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు మీతో ఫుట్‌బాల్ ఆడతారు- ఆనంపై నేదురుమల్లి ఫైర్
Nedurumalli Ramkumar Reddy : నా తండ్రి జనార్ధన్ రెడ్డి మిమ్మల్ని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి రాజకీయ భిక్ష పెట్టారు.

Nedurumalli Ramkumar Reddy(Photo : Google)
Nedurumalli Ramkumar Reddy – Anam Ramanarayana Reddy : వైసీపీ బహిష్కృత నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఆనం సంస్కారహీనుడు అని ఆయన మండిపడ్డారు. టీడీపీ తరపున వెంకటగిరి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు ఎక్కడ నుంచి పోటీ చేసినా అక్కడి ప్రజలు ఆనంతో ఫుట్ బాల్ ఆడతారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు.
”వెంకటగిరిలో నువ్వు ఫుట్ బాల్ ప్లేయర్ ని తయారు చేయాలంటే మీకు నలుగురు వ్యక్తులు కావాలి. ముందు ఆ నలుగురిని చూపించు. నేను మిమ్మలి గౌరవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థికమంత్రి అని సంబోధిస్తే మీరు నన్ను బాతు బచ్చా అని సంబోధిస్తారా? గతంలో మీరు టీడీపీలో ఇబ్బందులు పడుతుంటే నా తండ్రి జనార్ధన్ రెడ్డి మిమ్మల్ని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లి రాజకీయ భిక్ష పెట్టారు.
Also Read..Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్
ఆనం అంటే ఏసీ సుబ్బారెడ్డి. ఆ పేరును మీరు చెడగొడుతున్నారు. టీడీపీ తరపున ఆనం ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని తెలుసుకుని టికెట్ ఇవ్వకున్నా 10 నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తా అంటున్నారు. టీడీపీలో మీ భవిష్యత్తు ఏంటో, ఎంతో ఆలోచించుకోండి. వెంకటగిరిలో మీ గెలుపు కోసం రాజాలు కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్లు వద్దన్న వ్యక్తిని ఛైర్మన్ చేశారు” అని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..
వెంకటగిరి వైసీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నేదురుమల్లి ఇష్టానుసారం మాట్లాడితే పడే వాళ్లు లేరు. మాకు నీ అంత ప్రావీణ్యం లేకపోయినా 2024 ఎన్నికల్లో మాత్రం నిన్ను ఫుట్‌బాల్ ఆడిస్తా. వెంకటగిరిలో ఫుట్‌బాల్ ఆడేవాళ్లను తయారు చేస్తా. ఈసారి నీకేం పగులుతుందో నాకే తెలియదు. నేదురుమల్లి చదువుకుంటే సరిపోదు.. సంస్కారం నేర్చుకో.
సంస్కారహీనులను వెంకటగిరి ప్రజలు ఆదరించరు. వెంకటగిరి ఎమ్మెల్యేగా 6 నెలలు జస్ట్ గ్యాప్ ఇచ్చా. వెంకటగిరిని ఎప్పుడూ వదలలేదు. నేను ఫుట్ బాల్ ఆట ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. నిన్ను వెంకటగిరిలో ఉన్న ఆరు మండలాల్లో ఫుట్ బాల్ ఆడిస్తా’ అని ఓ రేంజ్ లో నేదురుమల్లిపై నిప్పులు చెరిగారు ఆనం రామనారాయణరెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ కు నేదురుమల్లి అదే స్థాయిలో ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.