TDP Leaders : జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు.. నెల్లూరు నుండే వైసీపీ పతనం ప్రారంభం : టీడీపీ నేతలు
నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. నెల్లూరులో రాజకీయ పరిణామాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై చర్చించారు.

TDP LEADERS
People Oppose Jagan Govt : సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నెల్లూరు నుండే వైసీపీ పతనం ప్రారంభమైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. నెల్లూరులో రాజకీయ పరిణామాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ఏదీ చెబితే అది చేస్తానని అన్నారు. ఎక్కడ పోటీ చేయమని చెబితే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు. 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల్లూరులోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు.
MLA Grandhi Srinivas : చంద్రబాబుని బ్లాక్ మెయిల్ చేయడానికే పవన్ వారాహి యాత్ర : గ్రంధి శ్రీనివాస్
జగన్ ప్రభుత్వంపై ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారని పేర్కొన్నారు. సర్వేపల్లి, నెల్లూరు, రూరల్, యువగలం పాదయాత్ర విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని వెల్లడించారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర బాధ్యతలు తనకు అప్పగించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సలహా సూచనలు, కార్యకర్తలను కలుపుకుని లోకేష్ పాదయాత్ర విజయవంతం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాదయాత్రను నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో విజయవంతం చేస్తామని తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీ గెలుస్తుందని అమర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషమన్నారు. రాబోయే కాలంలో టీడీపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. వైసీపీ పార్టీ పతనం నెల్లూరు నుండే మొదలైందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులుకు స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.
అనిల్.. అరే.. తొరే కాకుండా రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. కాకాని మంత్రి అయ్యాక పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యే లు బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఇంచార్జ్ అబ్దుల్ అజీజ్, గిరిధర్ రెడ్డి, సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.