బీజేపీ ఒకలా చెబితే.. చంద్రబాబు మరోలా చెప్పారు: పేర్ని నాని

ఐదేళ్ల క్రితం జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయిందిని చెప్పారని అన్నారు.

Perni Nani

రోజుకొక శ్వేతపత్రం పేరుతో కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు బీజేపీ చెబితే.. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం రూ.10 లక్షల కోట్లని అసత్యాలు చెబుతున్నారని తెలిపారు.

సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేతులెత్తేశారని అన్నారు. ఐదేళ్ల క్రితం జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికే ఖజానా ఖాళీ అయిందని చెప్పారని అన్నారు. ఇక అప్పు కూడా పుట్టదని యనమల రామకృష్ణుడు అన్నారని తెలిపారు. అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పట్లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.

నారా లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న వారందరి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని తెలిపారు. చంద్రబాబే పోలవరాన్ని నాశనం చేశారని అన్నారు. ఆయనకు ఇష్టమైన వారికి కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయించారని ఆరోపించారు.

అమ్మకు వందనం పేరుతో తల్లీపిల్లల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. జగన్ ఒకరికే ఇస్తున్నారని తాము అధికారంలోకి వస్తే పిల్లలందరికీ అమ్మకు వందనం డబ్బు ఇస్తామన్నారని చెప్పారు. ఇప్పుడు పిల్లలకు పంగనామాలు పెట్టారని తెలిపారు. చంద్రబాబు మాటల్లో నిజాయితీ ఉండదని చెప్పారు.

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రతి ఏడాది జూన్ 25న ‘రాజ్యాంగ హత్యాదినం’