కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రతి ఏడాది జూన్ 25న ‘రాజ్యాంగ హత్యాదినం’
‘సంవిధాన్ హత్యా దివస్’ను ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని కేంద్ర మంత్రి అమిత్ షా..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 49 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్యాదినం)గా పాటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 1975, జూన్ 25న ఇందిరా గాంధీ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంతో రెండేళ్లపాటు పౌర హక్కులను భంగం కలిగింది. ఎమర్జెన్సీ రోజులను బీజేపీ పదే పదే గుర్తుకు తెస్తుంది.
‘సంవిధాన్ హత్యా దివస్’ను ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని కేంద్ర మంత్రి అమిత్ షా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ ఆలోచనా ధోరణిని ప్రదర్శిస్తూ ఎమర్జెన్సీని విధించారని అందులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేశారని చెప్పారు.
తప్పు చేయని లక్షలాది మందిని జైల్లో వేశారని తెలిపారు. మీడియా గళాన్నీ ఎత్తకుండా చేశారని అన్నారు. దీంతో భారత సర్కారు ప్రతి ఏడాది జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా నిర్వహించాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అమానవీయ దుర్ఘటనలను ఎదుర్కొన్న వారిని జూన్ 25న భారత్ స్మరించుకుంటుందని చెప్పారు.
25 जून 1975 को तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी ने अपनी तानाशाही मानसिकता को दर्शाते हुए देश में आपातकाल लगाकर भारतीय लोकतंत्र की आत्मा का गला घोंट दिया था। लाखों लोगों को अकारण जेल में डाल दिया गया और मीडिया की आवाज को दबा दिया गया। भारत सरकार ने हर साल 25 जून को ‘संविधान… pic.twitter.com/KQ9wpIfUTg
— Amit Shah (@AmitShah) July 12, 2024