Pitcher Plant: విశాఖలో నాన్‌వెజ్ మొక్క..! పురుగులను తింటూ పెరుగుతుంది.. దీని ప్రత్యేక ఏమిటంటే?
మొక్కలలో చాలా రకాలైన జాతులు ఉంటాయి. వాటిలో కొన్ని మొక్కలు చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి.

Pitcher Plant
Pitcher Plant: మొక్కలలో చాలా రకాలైన జాతులు ఉంటాయి. వాటిలో కొన్ని మొక్కలు చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి. అలాంటి అరుదైన మొక్కల్లో ఒకటి ‘పిక్చర్ ప్లాంట్’ మొక్క. ఈ మొక్క మాంసాహారి. అదేంటి మొక్కల్లోకూడా మాంసాహారులు.. శాఖాహారులు ఉంటాయా అని మీకు డౌట్ రావొచ్చు. అయితే, ఈ మొక్క నిజంగానే నాన్ వెజ్ తింటుంది. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ ముక్కలు కాదు.. పురుగులను జీర్ణం చేసుకొని అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకుని ఎదుగుతుంది. సాధారణంగా మేఘాలయ, అసోం వంటి ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. అయితే, ఈ మొక్క విశాఖలోనూ ఉంది.
విభిన్న జాతుల మొక్కలకు విశాఖపట్టణంలోని జీవ వైవిధ్య ఉద్యానవనం నిలయంగా మారింది. ఇక్కడ పెరిగే ‘పిక్చర్ ప్లాంట్’ అందరినీ ఆకట్టుకుంటుంది. దీని శాస్త్రియ నామం నెపెంతెస్. దీనికి కీటకాహార మొక్క అని పేరు. నాన్ వెజ్ మొక్క, ఆకలి మొక్క అని కూడా పిలుస్తారు. అయితే, ఈ మొక్క పురుగులను ఎలా తింటిందనే డౌట్ మీకు మీకు రావొచ్చు. ఈ మొక్కకు ఆకు చివరి భాగంలో బ్లాడర్ (కవర్) మాదిరిగా ఉంటుంది. దాని అంచు చివరన మకరందాన్ని స్రవిస్తుంది. ఈ మకరందం కోసం పురుగులు, చీమలు, క్షీరదాలు బ్లాడర్ వద్దకు చేరి అందులోకి దిగుతుంటాయి.
Also Read: తాగేనీళ్లతో కార్లు కడుగుతున్నారా.. అయితే భారీగా ఫైన్ కట్టాల్సిందే.. ఎక్కడో తెలుసా?
బ్లాడర్ జిగురుగా ఉండటంతో అందులోకి వెళ్లిన పురుగులు అక్కడే అతుక్కుపోతాయి. పైకిరాలేక చనిపోతాయి. ఈ పురుగులను పిక్చర్ ప్లాంటు జీర్ణం చేసైుకొని అవసరమైన ప్రొటీన్లను సమకూర్చుకొని ఎదుగుతుంది. అప్పుడప్పుడు చిన్న కప్పలను కూడా ఈ మొక్క తినేస్తుంది. ఉద్యానవన నిర్వాహకులు సూర్యరశ్మికి దూరంగా ఈ మొక్కను పెంచుతున్నారు. ఈ మొక్కను కీటక భక్షక మొక్క అని కూడా అంటారు.