ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసా?

మండలానికి ఒక ఇంచార్జ్‌ను నియమించడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత.

ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Pithapuram

ఏపీ ఎన్నికల వేళ.. పిఠాపురం హాట్ సీటుగా మారింది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ సీటు నుంచి పోటీ చేస్తుండటం.. పిఠాపురం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పవన్ పోటీ చేస్తానని స్టేట్‌మెంట్‌ ఇవ్వగానే పిఠాపురం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి గళం వినిపించారు. కార్యకర్తలతో భేటీ అయిన వర్మ అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.

ఆయన కచ్చితంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారు లేకపోతే.. టీడీపీ నుంచి జంప్ అవుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ చంద్రబాబు బుజ్జగించడంతో వర్మ సైలెంట్ అయిపోయారు. పవన్ గెలుపునకు సహకరిస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి పవనే క్యాండిడేట్.. ఇక అంతా సెట్టు.. ఎన్నికల రణక్షేత్రమే మిగిలి ఉందనుకున్న సమయంలో పవన్ మరో బాంబ్ పేల్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించే సమయంలో పవన్‌ స్టేట్‌మెంట్‌ మరోసారి పిఠాపురంను ఎలక్షన్‌ పాలిటిక్స్‌లో సెంటర్‌ చేసింది.. ఒకవేళ అమిత్‌షా ఆదేశిస్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానన్నారు పవన్‌. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్‌ని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపుతానని చెప్పారు.

పవన్ బరిలో ఉంటే..

ఈ కామెంట్స్ తో మరోసారి తెరమీదకు వచ్చారు వర్మ. పవన్ ఎంపీగా వెళ్తే పిఠాపురం నాదే.. ఈ విషయంలో తగ్గేదేలే అంటూ బిగ్‌బైట్‌ ఇచ్చారు. ముందే చెప్పినట్లుగా పవన్ బరిలో ఉంటే అతని గెలుపు కోసం శ్రమిస్తానంటున్నారు వర్మ. చంద్రబాబుకు ఇచ్చిన మాట కోసం పవన్ కల్యాణ్ ను గెలిపించేందుకు ప్రచారం ప్రారంభించినన్నారు. పిఠాపురంలో ప్రత్యేకమైన కమిటీని వేస్తున్నట్లు చెప్పారు. అధికార పార్టీ పద్మవ్యూహాన్ని అర్జునుడిలా చేధిస్తానంటున్నారు వర్మ.

పిఠాపురం సెంట్రిక్‌గా జనసేన, టీడీపీ ఇష్యూ కొనసాగుతుండగానే..అధికార వైసీపీ పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం వైఎస్ జగన్..మండలాలవారీగా ఇంచార్జులను నియమించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతతో సమావేశమై.. ఎన్నికల వ్యూహ రచనపై డిస్కస్ చేశారు సీఎం జగన్.

చేరికలపై వైసీపీ ప్రత్యేక దృష్టి 
చేరికలపై కూడా వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ. నియోజకవర్గంలో బలమైన నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్‌ మాకినీడు శేషుకుమారి వైసీపీ గూటికి చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శేషుకుమారి పిఠాపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె చేరికతో తమకు మరింత బలం తోడైందని చెబుతున్నారు వైసీపీ నేతలు.

మండలానికి ఒక ఇంచార్జ్‌ను నియమించడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను చిత్తుగా ఓడిస్తానంటున్నారు. తనపై ఎలాంటి విమర్శలు చేయలేక..లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు వంగాగీత. నామినేషన్లు దాఖలు కాకముందే పిఠాపురం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇక అసలు ఎన్నికల పోరు మొదలైతే.. రాజకీయాలు ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. భారీ భద్రత మధ్య తరలింపు