KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలన్న ఆలోచన ప్రధాని మానుకోవాలి : కేఏ పాల్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.

KA Paul
KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలనే అలోచనను ప్రధాని మోదీ మానుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్.. 32 మంది అమరుల త్యాగం, 16 వేల మంది నిర్వాసితుల భూదానం, అమ్మాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 2021లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్ వేశానని చెప్పారు.
పోరాట కమిటీ నాయకులను లెటర్ ఇవ్వాలని రెండేళ్ళుగా అడుగుతున్నా స్పందించడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలు 802 రోజులకు చేరుకున్నాయి. కూర్మన్నపాలేం శిభిరానికి వచ్చి కేఎ పాల్ సంఘీభావం తెలిపారు.
KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42 కోట్లకు బిడ్ వేస్తా : కేఏ పాల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు, కార్మికులకు న్యాయం చేసేందుకు పార్టీలకతీతంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఒకవేళ కచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలంటే 32 అమర వీరుల కుటుంబాలకు రూ.10 కోట్లు, నిర్వాసితులకు, కార్మికులకు రూ.8 కోట్లు పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.