KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42 కోట్లకు బిడ్ వేస్తా : కేఏ పాల్

చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు.

KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42 కోట్లకు బిడ్ వేస్తా : కేఏ పాల్

KA Paul

Updated On : April 23, 2023 / 11:33 AM IST

KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్తాపకుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు రూ.42వేల కోట్లకు బిడ్ వేస్తానని పేర్కొన్నారు. బిడ్ వేసేందుకు కొన్ని లేఖలు అవసరమని చెప్పారు. ఆ లేఖలు ఇవ్వాలని అడుగుతున్నానని.. అవి ఇస్తే రెండు వారాల్లోనే రూ.4వేల కోట్లు ఇస్తానని వెల్లడించారు.

అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో కేఏ పాల్ తన తండ్రి బర్నబాస్ ను కలిసేందుకు శనివారం ఏప్రిల్23న ఇక్కడకు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర స్థానికులను పలకరించి, వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ విలువ రూ.3.5 లక్షల కోట్లు కాగా, దాన్ని రూ.3,500కోట్లకు అమ్మేద్దామని చూస్తున్నారని ఆరోపించారు.

KA Paul: బిల్‌గేట్స్‌ను చంద్రబాబుకు పరిచయం చేసింది నేనే.. కుటుంబ పాలన పోవాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి: కేఏ పాల్

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు దాన్ని అందరం కలిపి కాపాడుకోవాలన్నారు. ఇందులో భాగంగానే టీడీపీ, వైసీపీ, సీపీఐ నేతలను కలిసేందుకు విశాఖపట్నం వచ్చానని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తానంటోందన్నారు. అయితే, ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాను’ అన్నట్లుగా కేసీఆర్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు రూ.5లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని జగన్ కు అప్పగిస్తే ఆయన మరో రూ.4లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు. తాను సీఎం అయితే అమరావతిలో ఆపేసిన భవానాలన్నింటినీ ఏడాదిలో నిర్మిస్తానని చెప్పారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, జనసేనాని పవన్ కల్యాణ్ తనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాట్లు తెలిపారు.