నమ్మించి నరకం చూపించారు : ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ

ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 03:37 PM IST
నమ్మించి నరకం చూపించారు : ఒంగోలు గ్యాంగ్ రేప్ కేసులో వీడిన మిస్టరీ

Updated On : January 29, 2020 / 3:37 PM IST

ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ

ఆమెది ప్రేమ వివాహం. కానీ కుటుంబకలహాలతో భర్తకు దూరంగా ఉండేది. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగించేది. కాయకష్టం చేస్తూ జీవనం సాగించే ఆ ఒంటరి మహిళపై కామాంధుల కన్ను పడింది. ఆమెతో మాటలు కలిపారు. నమ్మించి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా నగ్నంగా చేసి నరకం చూపించారు. ప్రాణం పోయేలా చేశారు. చివరకు చేసిన పాపం పండి కటకటాలపాలయ్యారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో వారం రోజుల కిందటి అత్యాచారం కేసులో మిస్టరీ వీడింది. కేశరాజుకుంట సమీపంలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు మానవ మృగాళ్లను కటకటాలవెనక్కి నెట్టారు. ఒంగోలు శివారు ప్రాంతంలో జనవరి 22 వివస్త్రగా, అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు…మహిళ వివస్త్రగా ఉండటం…సమీపంలో కండోమ్స్‌ కన్పించడంతో అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానించారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అదే రోజు చికిత్స పొందుతూ బాధిత మహిళ మృతి చెందడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ముమ్మర దర్యాప్తు చేసి కామాంధుల భరతం పట్టారు. 

సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన ఓ మహిళ ప్రేమ వివాహం చేసుకొని కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకొని పిల్లలను పోషిస్తోంది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన జాన్సన్‌, సియోను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కనకరాజు అలియాస్‌ దుర్గ…ముగ్గురు స్నేహితులు. వీరు ముగ్గురూ గంజాయికి బానిసలు. ఆ గంజాయే ముగ్గురిని స్నేహితులుగా మార్చింది. 

జనవరి 21వ తేదీ రాత్రి మహిళ గోరంట్ల కాంప్లెక్స్‌ వైపు నుంచి బలరాం కాలనీ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా జాన్సన్‌, సియోన్‌, దుర్గ ఆటోలో ఆమెను అనుసరించారు. మాటలు కలిపారు. అనంతరం ఆటోలో ఎక్కించుకొని కేశరాజుకుంట సమీపంలోకి తీసుకెళ్లారు. గంజాయి మత్తులో ఉన్న వారు మొదట ఆటోలోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలివేయాలని ఎంత వేడుకున్నా వినిపించుకోలేదు. అనంతరం ఆమెను బలవంతంగా సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి వివస్త్రను చేశారు. మరోసారి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం ఆమె వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌, రెండు వెండి ఉంగరాలు, రూ.160 నగదు అపహరించుకొని వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉండగా జనవరి 22వ తేదీ ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

నిందితుల్లో ఒకరైన జాన్సన్‌ మృతురాలి సెల్‌ ఫోన్‌లో సిమ్‌ కార్డును తీసేసి…అందులో తన సిమ్‌కార్డు వేసుకున్నాడు. అదే సమయంలో పోలీసులు విచారణలో భాగంగా మృతురాలి ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కాల్‌ డేటా పరిశీలన ప్రారంభించారు. ఆమె ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్‌తో జాన్సన్‌ సెల్‌ఫోన్‌ నంబర్‌ అనుసంధానమై ఉండటంతో పోలీసులు ఆ వైపు దృష్టి సారించారు. అలా సోమవారం మధ్యాహ్నం ఒంగోలులోని ఉత్తర బైపాస్‌లో నిందితులు జాన్సన్‌, సియోను, కనకరాజు అలియాస్‌ దుర్గలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి నేర సమయంలో వినియోగించిన ఆటో, హత్యకు గురైన మహిళ సెల్‌ ఫోన్‌, రెండు వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. కామాంధులు చేసిన ఘాతుకానికి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఓ వైపు తండ్రి దూరమవ్వడం…మరోవైపు చనిపోవడంతో ఇద్దరి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.