నీతండ్రిపై కేసు లేకుండా చేయాలంటే నా పక్కలోకి రా…కీచక ఎస్సై

  • Published By: murthy ,Published On : August 24, 2020 / 11:57 AM IST
నీతండ్రిపై కేసు లేకుండా చేయాలంటే నా పక్కలోకి రా…కీచక ఎస్సై

Updated On : August 24, 2020 / 1:28 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వ్యవహారం పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేవిధంగా మారింది. పొందూరు ఎస్.ఐ రామకృష్ణ మద్యం కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆడియో ఇపుడు హల్ చల్ చేస్తుంది.



పొందూరు మండలం తుంగపేట గ్రామానికి చెందిన అన్నెపు అప్పారావు ఇంట్లో ఎస్.ఐ రామకృష్ణ 48 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. 24 గంటలు గడుస్తున్నా కేసు నమోదు చేయని ఎస్.ఐ నిందితుని కుమార్తె పై కన్నేశాడు.

తన తండ్రిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే తన కామ కోర్కెలు తీర్చాలంటూ అడిగాడు. అంతేకాకుండా తాను నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. అయితే తన తండ్రితో కలిసి స్టేషన్ కు వస్తానని బాధితురాలు ఎస్.ఐ కి చెప్పింది. ఇంటికి ఒంటరిగా వస్తేనే కేసు లేకుండా చేస్తానని ఎస్.ఐ రామకృష్ణ మాయమాటలు చెప్పాడు.



ఎస్.ఐ దుర్బుద్ధిని గమనించిన సదరు మహిళ తెలివిగా ఎస్.ఐ బారినుంచి తప్పించుకుంది. అయితే చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ అధికారి స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల ఇలా వ్యవహరించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు కోసం మాట్లాడాలని చెప్పి ఓ మహిళను ఒంటరిగా ఇంటికి రమ్మనటం ఎస్.ఐ రామకృష్ణ వక్ర బుద్ధికి నిదర్శనం…