నా వద్ద ఆధారాలున్నాయ్.. అన్నీ బయటపెడతా.. పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీకోసం ఎంతో కష్టపడ్డాం. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మకం ద్రోహం చేస్తారా అంటూ పోతిన మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నా వద్ద ఆధారాలున్నాయ్.. అన్నీ బయటపెడతా.. పవన్ కల్యాణ్ పై పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు

Pothina Mahesh

Pothina Mahesh hot Comments on pawan kalyan : జనసేన పార్టీకి ఆ పార్టీ నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది.. పవన్ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదని అన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం పవన్ పనిచేస్తున్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై ఏనాడూ దృష్టిసారించలేదని పోతినేని తెలిపారు. పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్థపూరితం, పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని అన్నారు. 25రోజుల తరువాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా? 21 సీట్లతో పార్టీకి, ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరని పోతిన మహేశ్ ప్రశ్నించారు.

Also Read : జనసేన పార్టీకి బిగ్‌షాక్‌.. రాజీనామా చేసిన పోతిన మహేశ్

పార్టీకోసం కష్టపడ్డవారికి సీట్లివ్వరా?
జనసేన పార్టీకోసం ఎంతో కష్టపడ్డాం. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ పోతిన మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్లు కొనసాగుతుందో లేదో తెలియదు.. జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎందుకు సీట్లు కేటాయించలేదని ప్రశ్నించారు. టీడీపీ వారికే ఎందుకు సీట్లు ఇచ్చారు? పార్టీ శ్రేణులకు పవన్ సమాధానం చెప్పాలి. నా వద్ద ఆధారాలు ఉన్నాయి.. అన్నింటిని బయటపెడతా. కాపు సామాజిక వర్గంను బలి చేస్తున్నారు. కాపు యువతను మోసం చేయొద్దంటూ మహేశ్ సూచించారు.

Also Read : CM Jagan : పేదలకు మంచి కొనసాగాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి- సీఎం జగన్

మీ తల్లిని దూషించిన వ్యక్తికి టికెట్టా?
పవన్ కల్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏ విధంగా సీట్ ఇచ్చారని పోతిన మహేశ్ ప్రశ్నించారు. పచ్చనోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా? ఈ అంశంపై సమాధానం చెప్పాలి. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారు. టీడీపీ, జనసేనకు 10 స్థానాలు కుక్క బిస్కెట్స్ పడేసిందా అంటూ మహేశ్ ప్రశ్నించారు. బీజేపీ టీడీపీని సీట్లు సర్దుబాటు చేయమంది.. జనసేన ఎందుకు సీట్లివ్వాలి? జనసేన పార్టీ పొత్తు కుదిర్చితే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలి? కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా పవన్ మీకు అంటూ పోతిన మహేశ్ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాం. వీర మహిళల పదవీకాలం ఎందుకు పొడిగించారు.. మిగతా వారి పదవులు ఎందుకు పొడిగించలేదో చెప్పాలని అన్నారు.

Also Read : వైఎస్ షర్మిల, సునీతపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కామెంట్స్

విధేయుడిగా ఉంటే ద్రోహం చేస్తారా..
పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మకం ద్రోహం చేస్తారా అంటూ పోతినే మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. పశ్చిమ నియోజకవర్గం, తెనాలి నియోజకవర్గంలో పార్టీ సర్వే చేసింది. గెలిచే పశ్చిమ నియోజకవర్గం సీటును ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గం సీటును పెత్తందారులకు కాకుండా వేరేవారికి ఇచ్చిఉంటే సహకరించే వారమని పోతిన మహేశ్ అన్నారు.