Tirumala : తిరుమలలో వెలుగులోకి ప్రోటోకాల్ దర్శనాల స్కామ్..

ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tirumala : తిరుమలలో వెలుగులోకి ప్రోటోకాల్ దర్శనాల స్కామ్..

Tirumala (Photo Credit : Google)

Updated On : December 17, 2024 / 12:38 AM IST

Tirumala : తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాల స్కామ్ వెలుగుచూసింది. ప్రోటోకాల్ అర్హత లేని వారికి ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేసినట్లుగా బయటపడింది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య.. కల్నల్ విశ్వప్రసాద్ పేరుతో ప్రోటోకాల్ దర్శనాలు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. డిఫెన్స్ ఉద్యోగి బ్రహ్మయ్య ఈ విధానాన్ని చేశారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం అంతా బట్టబయలైంది. బ్రిగేడియర్ హోదా కలిగిన వారికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలకు అర్హత ఉంటుంది. కానీ, అర్హత లేని వారిని కూడా పెద్ద హోదాలో ఉన్నట్లుగా చూపుతూ వీఐపీ బ్రేక్ దర్శనాలకు దరఖాస్తు చేసుకున్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య విషయం వెలుగులోకి వచ్చింది.

ఎప్పటి నుంచో ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్య.. అర్హత లేని వారికి ఆర్మీ తరపు నుంచి సిఫార్సు లేఖలు పెడుతూ బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నాడు. అర్హత లేని వారికి క్యాడర్ కన్నా ఎక్కువ క్యాడర్ కు పెంచి వాళ్లకి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను చేయించాడు. తాజాగా ఒక కల్నల్ స్థాయి అధికారికి ఏకంగా బ్రిగేడియర్ అని చెప్పి అతడికి ప్రోటోకాల్ దర్శనం ఏర్పాటు చేశాడు. అయితే, ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తిరుపతిలో ఉన్న ఆర్మీ ఉద్యోగి బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతను గతంలోనూ ఇదే తరహాలో అనేక లేఖలు పెట్టి అడ్డదారిలో స్వామి వారి దర్శనాలు పొందినట్లు సమాచారం.

మొత్తంగా ఆర్మీ ఉద్యోగులకు మాత్రమే లెటర్లు పెట్టి దర్శనాలు చేయించాడా? లేకుంటే బయటి వ్యక్తులకు కూడా దర్శనాలు చేయించాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

Also Read : టీడీపీ వైపు జోగి రమేశ్‌ అడుగులు.. జోగికి టీడీపీ హైకమాండ్ వెల్‌కమ్‌ చెబుతుందా?