వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు ఫైర్

ఆ వివరాలు మిథున్ రెడ్డికి కావాలంటే తాను పంపుతానని చల్లా బాబు అన్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు ఫైర్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో చల్లా బాబు మాట్లాడుతూ… మిథున్ రెడ్డి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మిథున్ రెడ్డి, ఆయన తండ్రి వైసీపీ హయాంలో ఎంత మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారో మరచిపోయారేమోనని చెప్పారు.

ఆ వివరాలు మిథున్ రెడ్డికి కావాలంటే తాను పంపుతానని చల్లా బాబు అన్నారు. తాను పోలీసులను కొట్టానని అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. తనపై అక్రమంగా ఏడు ఛార్జ్ షీట్లు వేశారని చెప్పారు. మరో 700 మందిపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. వేలాది మంది మిథున్ రెడ్డి అక్రమ కేసులకు భయపడి ఊరు వదిలి వెళ్లిపోయారని చెప్పారు.

తన కారుపై చాలా సార్లు దాడులు చేశారని చల్లా బాబు అన్నారు. ఇప్పుడు అవన్నీ మరచిపోయి మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోకి రాకుండా ఆపింది వైసీపీ కాదా అని నిలదీశారు. బీజేపీని ఎన్నికల సమయంలో తిట్టి ఇప్పుడు ఢిల్లీలో అదే పార్టీకి మద్దతు పలికారని చెప్పారు.

డిసెంబరు నాటికి సీపీఐకి వందేళ్లు: కూనంనేని సాంబశివరావు