డిసెంబరు నాటికి సీపీఐకి వందేళ్లు: కూనంనేని సాంబశివరావు

ఈనాటికి కమ్యూనిస్టుల అవసరం ఉందని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని కూనంనేని సాంబశివరావు చెప్పారు.

డిసెంబరు నాటికి సీపీఐకి వందేళ్లు: కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao(Photo: Facebook)

డిసెంబరు నాటికి సీపీఐ వందేళ్ల వసంతంలోకి అడుగుపెడుతుందని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఎన్నో అటుపోట్లును చూసిందని తెలిపారు.

ఈనాటికి కమ్యూనిస్టుల అవసరం ఉందని ప్రజలు ఆదరణ చూపిస్తున్నారని కూనంనేని సాంబశివరావు చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని చెప్పి మోదీ తెల్లముఖం వేశారని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేది కమ్యూనిస్టులేనని చెప్పారు. అయోధ్య రామ మందిరం‌ ఉన్న చోట బీజేపీ ఓడిపోయిందని అన్నారు. తాము విద్యార్థి, యువజన సంఘాలను బలోపేతం చేస్తామని, సీపీఐని విస్తృత పరుస్తామని చెప్పారు.

స్థానిక సంస్థలలో‌ పోత్తులు ఉంటే కలిసి పోటీ చేస్తామని, లేదంటే ఒంటరిగా బరిలో నిలుస్తామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిస్టులది స్నేహం అని, తమ కవచాన్ని కాంగ్రెస్ వీడొద్దని అన్నారు. బీఆర్ఎస్ దెబ్బతిన్న చోట సీపీఐ వైపు చూస్తున్నారని, ప్రత్యామ్నాయ బలమైన పార్టీగా సీపీఐ ఉందని చెప్పారు. సింగరేణి తెలంగాణ సంపద అని అన్నారు. కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని మించి అబద్దాలు చెబుతున్నారని తెలిపారు.

రేపటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి: రఘునందన్ రావు