రేపటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి: రఘునందన్ రావు

Raghunandan Rao: కొన్ని రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునివ్వడం దురదృష్టకరమని చెప్పారు.

రేపటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి: రఘునందన్ రావు

రేపటి నుంచి కొత్త చుట్టాలు అమల్లోకి రానున్నాయని బీజేీపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వీటి వల్ల కొంత ఇబ్బందులు రావచ్చని చెప్పారు. అయితే, కొత్త చట్టాలపై న్యాయవాద మిత్రులు త్వరగానే అవగాహన తెచ్చుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.

కొత్త చట్టాలపై బార్ అసోసియేషన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. పార్లమెంట్‌లో చాలా మంది చట్టాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పటికీ చాలా మంది స్వాతంత్రం కాలం నాటి చట్టాలను కొనసాగిచాలని ఆందోళనకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునివ్వడం దురదృష్టకరమని చెప్పారు.

ఏదైనా చట్టంకానీ, అర్డినెన్స్ కానీ తేవాలంటే క్యాబినెట్ మీటింగ్ త్వరగా అమల్లోకి వస్తాయని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా రూపొందించిన చట్టాలను హేళన చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిప్డారు. జాతీయ భావాల కోసం కొత్త చట్టాలు అమలులోకి తెచ్చామని చెప్పారు.

తెలంగాణలో జనసేనాని జెండా పాతేనా? జగన్‌ను ఓడించిన జోష్‌లో పవన్‌ వేస్తున్న ఎత్తులేంటి?