Rains In Andhra Pradesh : అల్పపీడన ప్రభావంతో ఏపీలో 2రోజులు వర్షాలు

నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

Rains In Andhra Pradesh : అల్పపీడన ప్రభావంతో ఏపీలో 2రోజులు వర్షాలు

Ap Rains

Updated On : October 30, 2021 / 7:47 AM IST

Rains In Andhra Pradesh :  నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. ఈఉదయానికి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో మరో అల్పపీడన ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది.

Also Read : Huzurabad By Poll : ప్రారంభమైన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్

వీటి ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు