Ram Gopal Varma : ఏపీ సీఎం జగన్ కు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ
ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోరారు.

ram gopal varma open letter andhra pradesh cm jagan
RGV Open Letter : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై జగన్ సర్కారు తీసుకున్న చర్యలను ఆర్జీవీ అభినందించారు. ఇటువంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్స్ (ట్విటర్)లో కోరారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు.
”చంపుతా, బట్టలిప్పి నిలబెడతా, గొంతు కోస్తా లాంటి రెచ్చగొచ్చే మాటలు.. నిరాధార ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ప్రభావితమయ్యేలా తప్పుడు సమాచారం, హానికరమైన అబద్ధాలను ప్రచారం చేసేవారిని అస్సలు ఉపేక్షించొద్ద”ని రాంగోపాల్ వర్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కాగా, మంత్రి ఆర్కే రోజా గురించి అసభ్యంగా మాట్లాడిన బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంతకుముందు జాతీయ మహిళా కమిషన్ ను కోరారు.
My OPEN LETTER to the Honourable Chief Minister @ysjagan
We the citizens deeply appreciate the stern action taken by your Government on the disgraced ex minister #BandaruSatyanarayana for his VULGAR comments on the Honourable minister for tourism @RojaSelvamaniRK
We hope your…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2023
భువనేశ్వరి, బ్రాహ్మణికి ప్రశ్నలు
మహిళా మంత్రిపై మీ పార్టీ నాయకుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటూ నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ మాట్లాడిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా షేర్ చేశారు. బండారు సత్యనారాయణకు మద్దతుగా నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను అంగీకరిస్తారా అని కూడా ఆర్జీవీ ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ తర్వాత టీడీపీలో మరో ఆణిముత్యం అయ్యన్నపాత్రుడు అంటూ మరో యూట్యూబ్ లింక్ షేర్ చేశారు. బండారుపై చర్యలు తీసుకున్నట్టుగానే.. బ్రాహ్మణిని అగౌరవపరిచేలా వ్యాఖ్యానించిన అయ్యన్నపాత్రుడిపైనా చర్యలు చేపట్టాలని సెటైర్ చేశారు.
Does this mean that you endorse the abuses your party leader made on a woman minister between 1.08 to 2.26 seconds of this video ?https://t.co/msK75CumpM…
Do you also respectively agree with ur husband and son @BrahmaniNara gaaru and #Bhuvaneshwari gaaru ? … @NCWindia… https://t.co/I5J0DczCFQ— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2023
హైకోర్టును ఆశ్రయించిన బండారు
కాగా, ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను సోమవారం రాత్రి అత్యంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ అనకాపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 354/2023U/S 153(A), 354(A), 504, 505, 506, 509, 499 IPC, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీజీహెచ్ లో వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు బండారు సత్యనారాయణ అరెస్ట్ అక్రమంటూ ఆయన తరపు న్యాయవాది వివి సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Sir Honourable chief minister @ysjagan gaaru , like your government actioned #BandaruSatyanarayana for his vulgar comments on @RojaSelvamaniRK gaaru please do the same to #Ayyannapatrudu for his derogatory talk on @brahmaninara gaaru https://t.co/Nze2PJ3xnp
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2023