Tesla Cybertruck: కెవ్వు కేక.. మన అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్.. వీడియో వైరల్.. అదిరిపోయే ఫీచర్స్.. ధర ఎంతంటే
సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. కొందరు దాని పక్కన నిల్చుని ఫోటోలు దిగారు. ఇంకొందరు దాని వీడియోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుని.. అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ అంటూ మురిసిపోతున్నారు.
Tesla Cybertruck Representative Image (Image Credit To Original Source)
- అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి
- సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు టెస్లా సైబర్ ట్రక్ లో వచ్చిన పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్
- కారును చూసేందుకు ఎగబడ్డ స్థానికులు
Tesla Cybertruck: ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య రామ్ ఈ కారుతో అమలాపురంలో కనిపించారు. సంక్రాంతి వేడుకల కోసం ఆదిత్య రామ్ ఈ వాహనంలో అమలాపురం వచ్చారు. అసలే టెస్లా కంపెనీ కారు.. ఇంకేముంది.. ఈ సైబర్ ట్రక్ ను చూసేందుకు జనాలు పోటీలు పడ్డారు. సైబర్ ట్రక్ ను దగ్గరి నుంచి చూసి మురిసిపోయారు. అబ్బ.. భలేగుందే అని అలా చూస్తుండి పోయారు.
సెల్ఫీలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. కొందరు దాని పక్కన నిల్చుని ఫోటోలు దిగారు. ఇంకొందరు దాని వీడియోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకుని.. అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ అంటూ మురిసిపోతున్నారు. అయితే, టెస్లా సైబర్ ట్రక్ ఎందుకంత స్పెషల్, ఇందులో ఫీచర్స్ ఏంటి, ధర ఎంత అనే ఆసక్తికర వివరాలు తెలుసుకుందాం.
టెస్లా సైబర్ ట్రక్.. ఓ లగ్జరీ వెహికల్. అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు. భారత్‌లో అత్యంత అరుదుగా కనిపించే వెహికల్. చూడగానే అట్రాక్ట్ చేసేలా దీని డిజైన్ ఉంటుంది. షార్ప్ డిజైన్, మెటాలిక్ ఫినిషింగ్, శక్తివంతమైన నిర్మాణం ఇందులోని ప్రత్యేకతలు. ఈ వాహనం బోల్డ్ లుక్, ఫ్లాట్ ప్యానెల్స్, మెటాలిక్ ఎడ్జస్ చూపు తిప్పుకోనివవ్వు. మన దేశంలోని రోడ్లపై ఇటువంటి మోడల్స్ కనిపించడం చాలా అరుదు. కాగా, ప్రస్తుతం ఇండియాలో టెస్లా మోడల్ Y కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర వేరియంట్స్ మాత్రం భారత్ లో ఇంకా అధికారికంగా లాంచ్ చేయలేదు. అవి కావాలంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే.
ఈ సైబర్ ట్రక్ ఎందుకు అంత స్పెషల్..
టెస్లా సైబర్ ట్రక్ బలమైన నిర్మాణం, పనితీరుకు బాగా ఫేమస్. జస్ట్ 2.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది 857PS శక్తిని, 1170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులలో టెస్లా సైబర్ ట్రక్ ఒకటి. కాపర్ టిన్డ్ క్లియర్ ఫినిష్.. ఈ సైబర్‌ట్రక్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. దీని స్టీల్ లుక్ స్పెషల్ గా నిలుస్తుంది. బోల్డ్ కలర్ చూపు తిప్పుకోనివ్వదు. దీన్ని చాలామంది మాన్‌స్టర్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు.

Tesla Cybertruck Representative Image (Image Credit To Original Source)
టెస్లా సైబర్‌ట్రక్ బోల్డ్, యాంగులర్ డిజైన్ కలిగుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో కూడిన పూర్తి ఎలక్ట్రిక్ పికప్. ఇది వివిధ వెర్షన్స్ లో వస్తుంది. హై-ఎండ్ “సైబర్ బీస్ట్” మోడల్ 2.7 సెకన్లలోపు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బలమైన టార్క్, టోయింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఇక ఈ టెస్లా సైబర్ ట్రక్ ధర ఎంతో తెలిస్తే కెవ్వుమని కేక పెట్టాల్సిందే. యూఎస్ లో ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ ధర దాదాపు 66 లక్షల నుండి 83 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ట్యాక్సులు, ఇంపోర్ట్ ఖర్చులు అదనం. ఈ ట్రక్కులో పెద్ద టచ్ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి. ఇక వేరియంట్‌ను బట్టి దాదాపు 320-540 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఉన్నాయి.
AndhraPradesh: Rare sight in #Amalapuram as @Tesla #Cybertruck arrived with entrepreneur #AdityaRam for #Sankranti. Crowds thronged, selfies went viral, town buzzed. Tesla Model Y now in #India. pic.twitter.com/etQj3X8F19
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) January 16, 2026
