ఎవరూ అధైర్యపడొద్దు : మళ్లీ మోడీ, చంద్రబాబు, పవన్ కలుస్తారు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందడంలో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపిన రాయపాటి.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోందన్నారు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది.. అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. మూడు రాజధానులు అనేది హాస్యాస్పదం అన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, మోడీతో విభేదించి చంద్రబాబు తప్పు చేశారని రాయపాటి అన్నారు. మళ్లీ బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేస్తారని రాయపాటి జోస్యం చెప్పారు. మళ్లీ మోడీతో కలవాల్సిన అవసరం ఉందన్న రాయపాటి.. దానికోసం సీనియర్లమంతా కలిసి చంద్రబాబుకు సూచిస్తామని వెల్లడించారు.
సోమవారం(జనవరి 13,2020) మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో మాట్లాడిన రాయపాటి.. మూడు రాజధానులు తగదన్నారు. కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలని సీఎం జగన్‌కు హితవు పలికారు. అమరావతి రైతులు తమ పోరాటాన్ని ఆపొద్దన్నారు. శ్రుతి మించుతున్న పోలీసుల వైఖరిపై తిరగబడాలని రైతులకు పిలుపునిచ్చారు రాయపాటి.
మళ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తాయని, కలిసి పోటీ చేస్తారని.. రాయపాటి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. డిస్కషన్ కు దారితీశాయి. ఇప్పటికే బీజేపీతో పవన్ పొత్తు కుదుర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను కలిసిన పవన్.. భవిష్యత్తులో బీజేపీ-జనసేన కలిసి పని చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ నాయకులు సైతం.. బీజేపీతో స్నేహం కోరుకుంటున్నామని చెప్పడం విశేషం.
Also Read : రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబు సంచలన స్టేట్ మెంట్