Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

Vallabhaneni Vamsi

Updated On : April 7, 2025 / 9:15 PM IST

Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. భూకబ్జా కేసులో వంశీకి ముందస్తు బెయిల్‌ మంజూరైంది. భూకబ్జా చేశాడని ఆత్కూర్‌ పోలీస్ స్టేషన్ లో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో గన్నవరం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో వంశీ కస్టడీ పిటిషన్‌ డిస్మిస్ చేసింది కోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

8 ఎకరాల భూమి కబ్జా చేశాడని వంశీపై గన్నవరంలోని ఆత్కూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ గన్నవరం కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈ కేసులో పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు.. వంశీకి బెయిల్ ఇచ్చింది.

Also Read : త్వరలోనే ఏపీ వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు.. ఉచిత వైద్య చికిత్స కోసం కార్డులు: చంద్రబాబు

బెయిల్ మంజూరు అయినప్పటికీ.. వంశీ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో కూడా బెయిల్ వస్తేనే వంశీ బయటికి వచ్చే అవకాశం ఉంది.

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరిలో దాడి జరిగింది. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ఆఫీస్ పై దాడిని సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తున్నారు.