త్వరలోనే ఏపీ వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు.. ఉచిత వైద్య చికిత్స కోసం కార్డులు: చంద్రబాబు

రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నామని చెప్పారు.

త్వరలోనే ఏపీ వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు.. ఉచిత వైద్య చికిత్స కోసం కార్డులు: చంద్రబాబు

Updated On : April 7, 2025 / 3:19 PM IST

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై వివరాలు తెలిపారు. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామని, వైద్య చికిత్స కోసం ABHA కార్డులు అందుతాయని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మంచి ఆహారం, నిద్ర, ఎక్సర్‌సైజ్ ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వంపై ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్ ఉండాలి. డిజిటల్ లాకర్ లో హెల్త్ రికార్డులు ఉంటాయి.

ఆరోగ్య సలహాలు ఎప్పటికప్పుడు ఇవ్వడం కోసం ప్రత్యేక యాప్ ఉంటుంది. హెల్త్ ప్రాక్టిషనర్లు అందరూ ఆన్ లైన్ లో ఉంటారు. ఆహారం ఔషధం, వంటగదే ఔషధశాల అనే సూత్రాన్ని నేను బలంగా నమ్ముతాను. అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రభుత్వాలు చేసే వ్యయం తగ్గుతుంది.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందన్నది వాస్తవం. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తాం. ప్రస్తుతం పైలట్ గా కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ను చేశాం. త్వరలో చిత్తూరు జిల్లాలో చేయబోతున్నాం. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తయారు చేస్తాం.

త్వరలో పిల్లల హెల్త్ రికార్డులను కూడా డిజిటల్ లాకర్ లో పెడతాం. ఏపీలో అందరికీ ఆభా ఐడీ కార్డులు జారీ చేస్తాం. రియల్ టైంలోనే ప్రజల ఆరోగ్యం పర్యవేక్షించాలని భావిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ వాహనం ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తుంది. మొత్తం 27 పరీక్షలు మొబైల్ వ్యాన్ ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ.

ఈ వ్యవస్థల రూపకల్పనకు టాటా సంస్థ తో పాటు, బిల్ గేట్స్ ఫౌండేషన్, ఏపీ మెడ్ టెక్ పార్క్ సహకరిస్తాయి. జూన్ 15 నాటికి కుప్పంలో హెల్త్ నర్వ్ సెంటర్ ప్రారంభిస్తాం. ప్రతి నియోజక వర్గంలో 100 పడకల తో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

అవసరం అయితే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ కూడా ఇస్తాం. రాష్ట్రంలో ప్రభావితం చేస్తున్న 10 ఆరోగ్య సమస్యల పై ప్రత్యేక అధికారులను నియమిస్తాం. క్యాన్సర్ కు ఇప్పటికే డాక్టర్ నోరి దత్తాత్రేయుడును నియమించాం” అని అన్నారు.

Samsung: శాంసంగ్‌ మొబైల్‌ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెటరంటే?

“వైద్యారోగ్య శాఖలో అనేక ప్రయోగాలు చేస్తున్నాం. రూ.19,264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నాం. ఆసుపత్రుల్లో ఎక్కువ ఖర్చు రూమ్ చార్జీల రూపంలో అవుతోంది. అందుకే ఓ వినూత్నమయిన ప్రయోగం చేస్తున్నాం. 100 నుంచి 300 బెడ్ ఆసుపత్రులను అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.

అమరావతిని గ్లోబల్ మెడికల్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించాం. కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో హృద్రోగాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డయాబిటిక్ వ్యాధి ఎక్కువగా ఉంది. ప్రకాశం, కర్నూలు, అనంతపురంలలో రెస్పిటిరేటరీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. గత అయిదేళ్లుగా రోగులు వచ్చిన ఆసుపత్రుల నుంచి ఈ డేటాను తయారు చేశాం” అని చంద్రబాబు నాయుడు అన్నారు.