స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2019…ఏపీకి నాలుగు,తెలంగాణకి మూడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 6, 2019 / 11:31 AM IST
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్-2019…ఏపీకి నాలుగు,తెలంగాణకి మూడు

Updated On : March 6, 2019 / 11:31 AM IST

తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఏడు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ పగరాల జాబితా కోసం జనవరి-4నుంచి 31వరకు మొత్తం 4,234 పట్టణాలు,నగరాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. అవార్డుల జాబిలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లురుపేట, కావలి నిలువగా తెలంగాణ నుంచి సిద్దిపేట,సిరిసిల్ల,బోడుప్పల్ నిలిచాయి. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్ ఈ ఘనతను దక్కించుకుంది. అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా భోపాల్ నిలిచింది.

స్వచ్ఛత కోసం పాటుపడుతున్న టాప్ -3 రాష్ట్రాలుగా ఛత్తీస్ గఢ్,మహారాష్ట్ర,ఝార్ఖండ్ లు నిలిచాయి. 1- 3 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరంగా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలువగా, 3-10 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరంగా ఉజ్జయిని నిలిచింది.10 లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. 2019 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను రాష్ట్రపతి కోవింద్ బుధవారం(మార్చి-6,2019) ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ప్రధానం చేశారు.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డ్స్ 2019 టాప్ ర్యాంకుల జాబితా ఇదే..
తొలి ర్యాంకు : మధ్యప్రదేశ్, ఇండోర్ నగరం
రెండో ర్యాంకు : అంబికాపూర్, చత్తీస్ గఢ్
మూడో ర్యాంకు : కర్ణాటక, మైసూర్ 
చిన్న నగరం : న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియా
బిగ్ సీటీ : అహ్మదాబాద్, గుజరాత్
మిడియం సిటీ : ఉజ్జేయిన్, మధ్యప్రదేశ్
బెస్ట్ గంగా టౌన్ : గౌచర్, ఉత్తరాఖండ్
ఫాసెస్ట్ మూవింగ్ బిగ్ సిటీ : రాయ్ పూర్, ఛత్తీస్ గఢ్
ఫాసెస్ట్ మూవింగ్ మీడియం సిటీలు : మథుర-వ్రిందవన్, ఉత్తరప్రదేశ్
ఫాసెస్ట్ మూవింగ్ క్యాపిటల్/యూటీ సిటీ
నేవీ ముంబై – బెస్ట్ సిటీ (10 లక్షల మందికి పైగా జనాభా)
లబల్ పూర్ : బెస్ట్ సిటీ ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టిసెస్ (10 లక్షలకు పైగా జనాభా)
సూరత్ : బెస్ట్ సిటీ – సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (10లక్షలకు పైగా జనాభా)
చంద్రాపూర్ : బెస్ట్ సిటీ సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ (3-10 లక్షల జనాభా)
ఝాన్సీ : బెస్ట్ సిటీ (ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టిసీస్ (3-10 లక్షల జనాభా)
లాతూర్ : బెస్ట్ సిటీ – సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ (3-10 లక్షల జనాభా)
తిరుపతి : బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్స్ ఫీడ్ బ్యాక్ (1-3 లక్షల జనాభా)