Road Accident : చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి.

Road Accident : చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident in Chittoor District,

Updated On : May 16, 2024 / 8:57 AM IST

Road Incident in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయపడిన వారిని పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం

బంగారుపాళ్యం నుంచి వరిగడ్డి లోడుతో వస్తున్న లారీకి బ్రేక్ డౌన్ కావడంతో మరో లారీని ఢీకొట్టింది. అదుపుతప్పిన రెండు లారీలు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మరో బైక్ పై పడటంతో పెనుప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్లు లారీల్లోనే చిక్కుకుపోయారు. వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొద్దిసేపటికి పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

Also Read : బాలికపై అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు ఊరట.. ఎనిమిదేళ్ల జైలు శిక్ష రద్దు