Road Accident : తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి
తిరుపతిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. నేతాజీ రోడ్డులో జనంపైకి దూసుకెళ్లింది..

road accident in Tirupati : తిరుపతిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నేతాజీ రోడ్డులో జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు. బస్సు సృష్టించిన బీభత్సంలో నాలుగు బైక్‌లు ధ్వంసం కాగా.. రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.