Sajjala Ramakrishna Reddy : పురంధరేశ్వరి పేరుకే బీజేపీ అధ్యక్షురాలు కానీ టీడీపి అధ్యక్షురాలిలా వ్యవహరిస్తున్నారు : సజ్జల
పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లి చంద్రబాబును విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీకి అధ్యక్షురాలుగా ఉండి టీడీపి కోసం పని చేస్తున్నారు అంటూ ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy .. Purandeshwari
Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతు..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విమర్శలు చేశారు. పురంధరేశ్వరి పేరుకే బిజెపి అధ్యక్షురాలు.. కానీ టీడీపి అధ్యక్షురాలిలా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శించారు. పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్లి చంద్రబాబును విడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. బీజేపీకి అధ్యక్షురాలుగా ఉండి టీడీపి కోసం పని చేస్తున్నారు అంటూ ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం అంటూ డిల్లీ వెళ్లి చంద్రబాబు కోసం మాట్లాడినట్లు తెలుస్తోంది అంటూ సజ్జల విమర్శించారు.లోకేష్ డిల్లీ వెళితే ఎవరూ స్పందించలేదు అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికలు వస్తున్నాయి సత్తా ఉంటే ఇష్యూస్ పై మాట్లాడండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.చంద్ర బాబు తన కేసులు పర్సనల్ గా ఎదుర్కోవాలని సూచించారు.మద్యంపై వచ్చే ఆదాయం పెరిగిందని తమ ప్రభుత్వం వచ్చాక కొత్త బ్రాండ్స్ రాలేదని పర్మిషన్లు ఇవ్వలేదని అన్నారు. మద్యంపై అవినీతి జరుగుతోందని విమర్శిస్తున్నారంటూ అంటూ మండిపడ్డ సజ్జల అవినీతి ఎక్కడ జరుగుతుంది..? అని ప్రశ్నించారు.
మద్యం డబ్బులు నేరుగా ప్రభుత్వ ఖజానాలోనే డబ్బులు వెళ్తున్నాయి అని చెప్పుకొచ్చారు. మద్యం అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని..మద్యం షాపుల్లో క్యాష్, డిజిటల్ లావాదేవీలు రెండూ ఉన్నాయని తెలిపారు. మద్యం గురించి అని ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ పురంధేశ్వరిపై విమర్శలు చేశారు.