Sajjala Ramakrishna Reddy : అమరావతి, మావిగన్ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు, పవన్‌పై సజ్జల సంచలన కామెంట్స్..
Sajjala Ramakrishna Reddy : మావిగన్ మా పార్టీకి నష్టం చేస్తుందని అనేవాళ్లు ఉన్నారు. మేము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడటం లేదు. రాష్ట్రానికి నష్టం తెచ్చే అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy
- మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపాటు
- ఏపీకి అమరావతి పెద్ద గుదిబండ
- చంద్రబాబు, పవన్ పై సజ్జల సంచలన కామెంట్స్
Sajjala Ramakrishna Reddy : అమరావతి రాజధాని నిర్మాణం టీడీపీ నేతల జేబులు నింపుకోవడానికేనని, అమరావతి స్కాముల కోసం పెట్టారని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమరావతి అసాధ్యం, అవినీతి మయం, చంద్రబాబు కోఠరి జేబులు నింపడానికే అమరావతి రాజధానిని నిర్మాణం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Also Read : Pawan Kalyan : తిరుమల శ్రీవారి సేవలో ఏపీ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ ఫోటోలు వైరల్..
అమరావతి అనేది సాధ్యమైన రాజధాని కాదని, అది పూర్తిగా అవినీతి మయమైన ప్రాజెక్టుగా మారిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతి రాజధాని ప్రజల అవసరాలకోసం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రూపొందించిన ప్రాజెక్టు అని విమర్శించారు. అమరావతి పేరుతో భారీ స్కాములు జరిగాయని, దోపిడీ కోసమే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని సజ్జల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
రాజధాని విషయంలో కూటమి నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్నారని, గతంలో పవన్ కళ్యాణ్ కూడా అమరావతి కొద్ది మంది టీడీపీ నేతల క్యాపిటల్ మాత్రమేనని వ్యాఖ్యానించారని సజ్జల గుర్తు చేశారు. రాజధానిపై అసలు గందరగోళం సృష్టించింది కూటమి నాయకులేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వానికి చెందిన దాదాపు 30వేల ఎకరాల భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని భావించడం జరిగిందని, ప్రభుత్వ భూమి అయితే రాజధాని బెటర్ అని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. అందరికీ అందుబాటులో రాజధాని ఉంటుందని ఆరోజు అన్నారు. అమరావతిలో అవినీతి, దోపిడీ, ఆర్థిక భారం.. ఈ అంశాలన్నీ చెప్పారు. రాష్ట్ర ప్రజల డబ్బును వృథా చేయొద్దన్నందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తప్పుబడుతున్నారంటూ సజ్జల కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలో ఎలాంటి గందరగోళం లేదని, అమరావతిని రాజధానిగా తొలగిస్తున్నామని జగన్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. అమరావతి నేల స్వభావం కూడా రాజధానికి అనుకూలంగా లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
మావిగన్ పేరుతో జగన్ చేసిన ప్రకటనలతో చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం పెద్ద పరిశ్రమలన్నీ విశాఖపట్నానికి వెళ్తున్నాయని, అమరావతికి ఎందుకు రావడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై ఖర్చు చేస్తున్న మొత్తంలో కేవలం పది శాతం ఖర్చుతోనే సమర్థవంతమైన రాజధానిని అభివృద్ధి చేయవచ్చని అన్నారు. మావిగన్ అనగానే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారు. అమరావతికి, మావిగన్‌కు మధ్య తేడా ఏమిటో జగన్ పలుమార్లు చెప్పారు. దాని గురించే మరోసారి వైఎస్ .జగన్ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అసాధ్యమైనది.. దాంట్లో 10శాతంతో మావిగన్ అవుతుందని సజ్జల పేర్కొన్నారు.
మావిగన్ మా పార్టీకి నష్టం చేస్తుందని అనేవాళ్లు ఉన్నారు. మేము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడటం లేదు. రాష్ట్రానికి నష్టం తెచ్చే అంశాలను తప్పకుండా ప్రస్తావిస్తాం. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లు ఏ కామెంట్ చేసినా వాటికే తగులుతాయి. వీళ్లు పెద్ద ఫేక్ సైన్యాన్ని నడుపుతున్నారు. అసభ్యంగా మాట్లాడడంలో వారి తరువాతే. కొడకల్లారా.. అంటూ గతంలో తిట్టారు. వారి మాటలను వారే వీడియోల ద్వారా చూడొచ్చు. చంద్రబాబు కూటమి నాయకుల దుర్మార్గాలు మితిమీరుతున్నాయని సజ్జల అన్నారు. మరోవైపు.. రాయలసీమలో స్టీల్‌ప్లాంట్ రావడం చంద్రబాబుకు ఇష్టంలేదు. రాయలసీమకే కాదు, చంద్రగిరి, కుప్పంకూ మంచి జరగడం ఆయనకు ఇష్టంలేదు. రాయలసీమ లిఫ్ట్‌ను ఆపేసి, ఇవాళ రాయలసీమ ప్రాంతం గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడని సజ్జల విమర్శలు చేశారు.
