Krishna River: కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు..!

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి గర్భగుడిలోకి కృష్ణవేణి వచ్చి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు పొటెత్తింది.

Krishna River: కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు..!

Krishna River

Updated On : July 24, 2021 / 5:57 PM IST

Krishna River: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సప్తనదుల సంగమప్రదేశంలో వెలిసిన సంగమేశ్వరుడి గర్భగుడిలోకి కృష్ణవేణి వచ్చి చేరింది. కృష్ణానదికి వరద నీరు పోటెత్తడంతో సంగమేశ్వర ఆలయంలోకి నీరు పొటెత్తింది. దీంతో ఆలయం మొత్తం నీటిలో మునిగింది. కేవలం గోపురం మాత్రమే దర్శనమిస్తోంది.

ఈనెల 20న గర్భగుడిలోకి రెండు అడుగుల మేర నీరు వచ్చి చేరగా.. ఇప్పుడు మొత్తం గుడి గోపురం మాత్రమే కనిపించేలా నీటిలో చిక్కుకుంది. గోపురం మాత్రమే భక్తులకు దర్శనమిస్తోంది. దీంతో పూజారులు కృష్ణమ్మకు హారతి ఇచ్చి.. సంగమేశ్వరుడికి అంత్య పూజలు నిర్వహించి సంగమేశ్వర స్వామికి వీడ్కోలు పలికారు. ప్రతి ఏడాది ఈ ఆలయం నీటిలో మునగడం.. సంపూర్ణ జలాధివాసంలోకి చేరడం జరుగుతుంది.

ప్రతి ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరినప్పుడు ఈ ఆలయం ముంపునకు గురవుతుంది. సంగమేశ్వరాలయం ఈ ఏడాది మార్చి 21న కృష్ణా జలాల నుంచి బయటపడగా ఇప్పుడు తిరిగి వరద నీరు గుడిని ఆక్రమించేసింది. మొత్తం 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వగా.. మళ్ళీ స్వామి దర్శనం కోసం మరో 8 నెలలు వేచి చూడాల్సిందే.