ప్లీజ్ చెక్ : ఏపీ సంక్రాంతి సెలవుల్లో మార్పు

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 04:50 AM IST
ప్లీజ్ చెక్ : ఏపీ సంక్రాంతి సెలవుల్లో మార్పు

Updated On : January 3, 2019 / 4:50 AM IST

సంక్రాంతి సెలవు తేదీల్లో మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో ఇచ్చిన షెడ్యూల్ మారుస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. క్యాలెండర్ ప్రకారం 2019, జనవరి 8 నుంచి 17వ తేదీ వరకు సెలవులు. ప్రస్తుతం ఈ తేదీలను మార్చారు. కొత్తగా ఉత్తర్వుల ప్రకారం జనవరి 12 నుంచి 20వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్. 
    ఏపీలో సంక్రాంతి సెలవుల తేదీలను మార్చటానికి కారణం జన్మభూమి – మాఊరు కార్యక్రమం. 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. సెలవులు ప్రకటిస్తే ప్రోగ్రామ్ అంతా డిస్ట్రబ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి సెలవుల తేదీలను మార్చారు. ఈ తేదీల మార్పు ఒక్క ఏపీపైనే కాదు.. తెలంగాణపైనా ఎఫెక్ట్ చూపుతోంది. ఎందుకంటే లక్షల మంది ఏపీకి వెళతారు. ఇప్పటికే టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది. సెలవు తేదీలు మారటంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.