Satyam Babu : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యం బాబు లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యం బాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

Satyam Babu : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సత్యం బాబు లేఖ

Satyam Babu

Updated On : November 21, 2021 / 9:45 PM IST

Ayesha Meera murder case : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో.. నిర్దోషిగా బయటపడిన సత్యం బాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు. చేయని నేరానికి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అన్ని అంశాలను అమలు చేయాలని కోరారు.

హైకోర్టు పరిహారం చెల్లించమని ఆదేశించినా.. ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయస్థానం ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కోరారు. హైకోర్టు తీర్పు కాపీని లేఖతో జత చేసినట్లు తెలిపారు.

Rajampeta Floods : రాజంపేట వరద ఘటనలో 26 మంది మృతి..అధికారిక ప్రకటన

తనకు జరిగిన అన్యాయం, నష్టపోయిన జీవితకాలం, ఆరోగ్య సమస్యల గురించి లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. తనను చేయని పాపానికి కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని.. కాళ్లు చచ్చుబడిపోయిన తనను ఆదుకోవాలని లేఖలో విన్నవించుకున్నారు.