Tdp Bjp Seats Issue : గెలిచేవి మీకు, ఓడేవి మాకా? చంద్రబాబుపై బీజేపీ సీనియర్లు సీరియస్

గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Tdp Bjp Seats Issue : గెలిచేవి మీకు, ఓడేవి మాకా? చంద్రబాబుపై బీజేపీ సీనియర్లు సీరియస్

Tdp Bjp Seats Issue

Tdp Bjp Seats Issue : ఏపీ బీజేపీ మధ్య సీట్ల పంచాయితీ మొదలైంది. టీడీపీ గెలవని సీట్లను బీజేపీకి కేటాయించారని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి లేఖ రాశారు. ఈ క్రమంలో పార్టీ చీఫ్ పురంధేశ్వరికి ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆమె ఢిల్లీకి వెళ్లారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనీతో పాటు మరికొన్ని సీట్లపైనా బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీట్లు ప్రకటించినా మార్పులు తప్పవంటున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

అభ్యర్థులను ప్రకటించే సమయంలో కూటమిలో ముసలం మొదలైంది. ఓడిపోయే సీట్లన్నీ బీజేపీకి కేటాయించారని టీడీపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఏపీ బీజేపీలో సీట్ల పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది టీడీపీ. ఎంపీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినా.. పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ సీనియర్లు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించారు. అయితే, ఆ నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీకి సరైన క్యాడర్ లేదని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టే.. వాటిని తమకు కేటాయించారని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తమ హైకమాండ్ కు లేఖ కూడా రాశారు.

Also Read : టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు.. 11 నియోజకవర్గాల అభ్యర్థులు వీరే?