రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

SEC directions on ration distribution vehicles : రేషన్ పంపిణీ వాహనాలపై ఏపీ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై ఆంక్షలు విధించింది. రంగులు మార్చకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలను నిరాకరించింది. రేషన్ పంపిణీ వాహనాలకు పూర్తిగా రంగులు మార్చాలని ఎస్ఈసీ సూచించింది.
రంగులు మార్చిన వాహనాలను చూపించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. పరిశీలించాక అనుమతి ఇస్తేనే వాహనాలను తిప్పాలని ఎస్ఈసీ ప్రకటించింది.