నాకు ప్రాణహాని ఉంది

SEC Nimmagadda Ramesh Letter to DGP : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. విధులకు హాజరుకాబోమని బహిరంగంగా వ్యాఖ్యానించారని లేఖలో పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని..ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతికదాడికి పాల్పడే అవకాశం ఉందన్నారు. అతని చర్యలతో తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని ఎస్ ఈసీ నిమ్మగడ్డ కోరారు.
వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు తనను బెదిరించే విధంగా ఉన్నాయని…కదిలికలపై నిఘా ఉంచాలని లేఖలో పేర్కొన్నారు. ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు తనను బెదిరించేలా, ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు.
‘నా ప్రాణాలకు ముప్పు కల్గినప్పుడు ఎదుటివాళ్లను చంపే హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది’ అని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కాబట్టి వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్ణకరం..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తనపై భౌతికదాడులకు దిగే అవకాశం ఉందని లేఖలో నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు.