విజయవాడ నుంచి రహస్యంగా బయల్దేరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ప్రైవేట్ వాహనంలో పయనం

విజయవాడ నుంచి రహస్యంగా బయల్దేరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ప్రైవేట్ వాహనంలో పయనం

Updated On : January 24, 2021 / 3:20 PM IST

SEC Nimmagadda, who secretly left Vijayawada : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా బయల్దేరారు. ఎన్నికల కమిషనర్ వాహనంలో కాకుండా ప్ర్రైవేట్ వాహనంలో పయనమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ నిర్వంహిచారు.
అయితే పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు హాజరుకాలేదు. దీనిపై ఎస్ఈసీ సీరియస్ అయ్యారు.

అంతకముందు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఏపీ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. విధులకు హాజరుకాబోమని బహిరంగంగా వ్యాఖ్యానించారని లేఖలో పేర్కొన్నారు.

వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని..ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంకట్రామిరెడ్డి తనపై భౌతికదాడికి పాల్పడే అవకాశం ఉందన్నారు. అతని చర్యలతో తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీని ఎస్ ఈసీ నిమ్మగడ్డ కోరారు.