Seediri Appalaraju: అప్పుడు గాడిదలు కాశారా ఏంటీ?: ఏపీ మంత్రి సీదిరి

చంద్రబాబు మొదటిసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండుసార్లు మోసపూరిత మేనిఫెస్టోలతో ముఖ్యమంత్రి అయ్యారని సీదిరి అప్పలరాజు అన్నారు.

Seediri Appalaraju: అప్పుడు గాడిదలు కాశారా ఏంటీ?: ఏపీ మంత్రి సీదిరి

Seediri Appalaraju

Seediri Appalaraju – YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించింది మేనిఫెస్టో కాదని మోసఫెస్టో, మాయఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. ఇవాళ శ్రీకాకుళం (srikakulam) జిల్లాలో సీదిరి అప్పలరాజు మాట్లాడారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను ఇస్తానని చంద్రబాబు అంటున్నారని, మరి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పని ఎందుకు చేయలేదని అడిగారు. అప్పుడు గాడిదలు కాశారా అని నిలదీశారు.

చంద్రబాబు మొదటిసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండుసార్లు మోసపూరిత మేనిఫెస్టోలతో ముఖ్యమంత్రి అయ్యారని సీదిరి అప్పలరాజు అన్నారు. 2014లో చంద్రబాబు వందల హామీలు ఇచ్చారని, పదుల సంఖ్యలో కూడా హామీలను నెరవేర్చలేదని చెప్పారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే వంద శాతం హామీలను నెరవేర్చారని సీదిరి అప్పలరాజు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక లా అప్పుల పాలవుతుందంటూ ప్రధానమంత్రికి లేఖలు రాసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మొదటి దశ మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు.

ఆయన మేనిఫెస్టోలు నీటి మీద రాతలు మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆయన ఇంట్లో రెవెన్యూ వచ్చిందని, రాష్ట్రంలో కాదని అన్నారు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో వృద్ధి రేటులో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుందని చెప్పుకొచ్చారు.

YS Sharmila: చిన్నదొర కేటీఆర్ గారూ.. మీకు ఓ సవాల్ విసురుతున్నా: వైఎస్ షర్మిల