Chevireddy Bhaskar Reddy : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సిట్ అదుపులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. కొలంబో వెళ్తుండగా అడ్డుకున్న అధికారులు
చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని ఏ34గా చేర్చారు సిట్ అధికారులు.

Chevireddy Bhaskar Reddy : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాఫ్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఎఫ్ఐఆర్ లో ఏ38గా పేర్కొంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడిని ఏ34గా చేర్చారు సిట్ అధికారులు. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని అడ్డుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. చెవిరెడ్డిపై లుకౌట్ సర్కులర్ ఉండటంతో అడ్డుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెవిరెడ్డిని బెంగళూరు నుంచి విజయవాడకు సిట్ తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వెంకటేశ్ నాయుడిని సిట్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డిని A38 గా చేరుస్తూ. కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి కొలొంబో వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ కు వెళ్లారు చెవిరెడ్డి. అయితే, ఆయనపై లుకౌట్ సర్కులర్ ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. రేపు మధ్యాహ్నం చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది.