Gossip Garage: బీజేపీలోకి మెగాస్టార్..? కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్..
బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరుకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తుండటంతో..

Gossip Garage: 150కి పైగా సినిమాల్లో నటించిన సినీ స్టార్. పరిచయం అక్కర్లేని మెగాస్టార్. సినిమాల్లో సక్సెస్ అయినట్లే పొలిటికల్ సూపర్ స్టార్ కూడా కావాలనుకున్నారు. అందుకే పార్టీ పెట్టారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌లో మెర్జ్ చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు.
త్వరలో బీజేపీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఈ ప్రచారం జరుగుతున్నా లేటెస్ట్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కామెంట్స్‌తో చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. చిరు రాజకీయ ప్రయాణం ఎటువైపు? కమలం పార్టీ పిలిస్తే చిరు కండువా కప్పుకుంటారా?
మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నా..ఆయనను మాత్రం రాజకీయాలు వదిలి పెట్టడం లేదు. తెలుగు స్టేట్స్‌లోనే కాదు..నేషనల్ వైడ్‌గా ఆయనకున్న క్రేజే వేరు. సినిమా పరంగానే..రాజకీయం రంగంలోనూ చిరుకు మంచి పరిచయాలే ఉన్నాయి. క్లీన్ ఇమేజే ఉంది. అయితే కొన్నాళ్లుగా చిరంజీవి కమలం గూటికి చేరుతారన్న టాక్ ఆసక్తిరేపుతోంది. ఈ ప్రచారంపై చిరంజీవి ఎక్కడా స్పందించడం లేదు. నో కామెంట్..పాలిటిక్స్‌కు దూరం అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు.
అయితే లేటెస్ట్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి బీజేపీలో చేరతారన్నది ఎప్పటి నుంచో ఉన్న ఒక పుకారు లాంటి ప్రచారం. దానిని చాలా గట్టిగా గాసిప్ కంటే ఎక్కువగా రాసుకునేంత వీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫ్ ది రికార్డ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిని పిలిస్తే బీజేపీలో చేరుతారని కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీజేపీకి ఎంతో మంది సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న ఆయన తనకు చిరంజీవి మంచి మిత్రుడిగా చెప్పుకున్నారు. చిరంజీవిని ఆహ్వానిస్తే కనుక బీజేపీలో చేరుతారని తన పుట్టిన రోజు వేళ మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కిషన్‌రెడ్డి. మరోవైపు చిరంజీవి ఈ మధ్యకాలంలో బీజేపీ పెద్దలతో సన్నిహితంగా కనిపిస్తూ ఉన్నారు. మెగాస్టార్‌గా తెలుగు నాట దశాబ్దాలుగా వెలుగుతున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చారు. అక్కడ ఇమడలేకనే ఆయన తప్పుకున్నారని అంతా అంటుంటారు.
చిరంజీవి కూడా సినీ రంగంలోనే తనకు బాగుందని చెబుతూ ఉంటారు. అయితే చిరంజీవి చుట్టూ రాజకీయాలు మాత్రం అలా తిరుగుతూనే ఉంటున్నాయి. కిషన్‌రెడ్డి కామెంట్స్‌తో చిరు బీజేపీలో చేరడం ఒక్కటే తర్వాయి అన్నట్లు మళ్లీ ప్రచారం ఊపందుకుంది. మెగాస్టార్ అయితే రాజకీయాలకు దూరం అన్న తన స్టాండ్‌ను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం బీజేపీలో చిరు చేరికపై ధీమా వ్యక్తం చేయడంపై చర్చ సాగుతోంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు..అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత..అటు కేంద్రంలో, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్‌గా సైలెంట్ అయిపోయారు.
ఆ తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయినా..రాజకీయాలు మాత్రం చిరును వదిలిపెట్టడం లేదు. తరుచూ ఏదో ఒక ఘటన మెగాస్టార్‌ను రాజకీయాల్లోనూ లాగుతోంది. ఆ మధ్య ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ..చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read: భారీగా బోగస్ రేషన్ కార్డులు..? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వే చేయిస్తున్న ప్రభుత్వం
చిరును మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఆయన సేవలను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు చాలా సందర్భాలను గుర్తు చేస్తున్నారు. గతేడాది జూన్ కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని..చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్ హైలెట్‌గా నిలిచింది. దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
ఇప్పటికైతే చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనకు ఏఐసీసీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో చిరుకు బీజేపీ ఇస్తున్న ఇంపార్టెన్స్ చర్చనీయాంశం అవుతోంది. చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్ టైమ్ పనిచేస్తారా లేక..రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్‌గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే బీజేపీ, జనసేన వేరు అన్నట్లుగా లేకపోవడం చిరుకు ప్లస్ పాయింట్ అంటున్నారు. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వ ఎజెండాతో పవన్ ముందుకెళ్తుండటంతో బీజేపీ, జనసేన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం అవుతోంది. పవన్ కూడా మోదీ, అమిత్‌షాతో సన్నిహితంగా ఉంటున్నారు. సేనానికి బీజేపీ అధినాయకత్వం మంచి ప్రయారిటీ ఇస్తుంది.
ఈ నేపథ్యంలో చిరు బీజేపీ గూటికి చేరుతారా.? రాజ్యసభకు నామినేట్ అవుతారా..? ఇద్దరు బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారా అన్నది ఆసక్తిరేపుతోంది. కిషన్‌రెడ్డి మాటలు నిజం అవుతాయా లేదా.? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..అన్నది చూడాలి మరి.