Snakes : ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న ప్రాంతంలో.. పాముల కలకలం.. అధికారుల్లో టెన్షన్ టెన్షన్..

అసలు పాములు అక్కడికి ఎలా వచ్చాయి? ఇంకో పాము ఎక్కడుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.

Snakes : ప్రధాని మోదీ ధ్యానం చేయనున్న ప్రాంతంలో.. పాముల కలకలం.. అధికారుల్లో టెన్షన్ టెన్షన్..

Updated On : October 15, 2025 / 10:28 PM IST

Snakes: శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పాములు కలకలం రేపాయి. ప్రధాన గేటు దగ్గర రెండు పాములు ప్రత్యక్షమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు వాటిని అక్కడ గుర్తించారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రనికి రానున్నారు. సరిగ్గా ఈ సమయంలో పాములు కనిపించడం కలకలం రేపింది. రెండు పాముల్లో ఒకదాన్ని స్నేక్ క్యాచర్ పట్టుకున్నారు. మరో పాము కోసం స్నేక్ క్యాచర్స్ కాళీ చరణ్, డాక్టర్ వెస్లీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ భీమ్లా నాయక్, దర్గయ్య, స్ట్రైకింగ్ ఫోర్స్ కోటేశ్వరరావు తీవ్రంగా గాలిస్తున్నారు. రేపు ఇదే ప్రాంగణంలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు.

మరో పాము కోసం స్నేక్ క్యాచర్ వెతుకుతున్నారు. సుమరు ఏడున్నర అడుగుల పాముని గుర్తించారు. పాముని పట్టుకోవడం కోసం సెర్చ్ చేస్తున్నాడు స్నేక్ క్యాచర్స్. ప్రధాని మోదీ ముఖ్య కార్యక్రమం ఇక్కడ ఉండడం వల్ల అధికారుల్లో టెన్షన్ మొదలైంది. అసలు పాములు అక్కడికి ఎలా వచ్చాయి? ఇంకో పాము ఎక్కడుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.