Somireddy : ఆ ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేస్తారా? సోమిరెడ్డి

ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Somireddy : ఆ ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేస్తారా? సోమిరెడ్డి

Somireddy Chandra Mohan Reddy

Updated On : December 26, 2021 / 7:57 PM IST

Somireddy : ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం కొనసాగుతోంది. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. అటు ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ ఇష్యూలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సినీ పరిశ్రమపై సీఎం జగన్ కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారతి సిమెంట్‌ను రూ.100కే అమ్మండి అంటూ మరో టీడీపీ సీనియర్ నేత ట్వీట్‌ కూడా చేశారు.

ఏపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదన్నారు. ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Union Bank of India Jobs : యూనియన్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వివరాలు

ఇప్పటికే రాష్ట్రంలో 125 థియేటర్లు మూతపడ్డాయని సోమిరెడ్డి వాపోయారు. కక్ష సాధింపులకూ ఓ అడ్డు ఉంటుందన్నారు. సూళ్లూరుపేటలో అతి పెద్ద థియేటర్‌ను మూసివేశారని సోమిరెడ్డి గుర్తుచేశారు. సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని నిలదీశారు. రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని సోమిరెడ్డి అడిగారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నారని.. అలాంటి పథకాలతో పోటీ పడాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు సోమిరెడ్డి.

Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. అంతే ఘాటుగా బదులిస్తున్నారు. ”తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో లేదు. కానీ 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. లైట్‌ బాయ్‌ నుంచి స్టార్‌ హీరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌ పెద్దలు ఏపీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలి” అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ట్వీట్‌ చేశారు.

టికెట్ ధరల తగ్గింపు చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని సినీ పరిశ్రమకు చెందిన వారు వాపోతున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఇది పెద్ద నష్టం అంటున్నారు. గ్రామాల్లో, మండలాల్లో టికెట్ రేట్లు 50 రూపాయల లోపే ఉన్నాయని, లో క్లాస్‌ టికెట్లు కేవలం ఐదు రూపాయలే ఉన్నాయంటున్నారు. దీనికి తోడు థియేటర్లపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టింది. లైసెన్స్, పరిశుభ్రత, ఎమ్మార్పీ ధరలు, పార్కింగ్‌ ప్లేస్‌, మెయింటనెన్స్ నిబంధనలు ఉల్లంఘించారని, లోపాలు ఉన్నాయని, సౌకర్యాలు సరిగా లేవని కొన్ని థియేటర్లని అధికారులు సీజ్ చేశారు. ఓవైపు తగ్గిన రేట్లు, మరోవైపు అధికారుల తనిఖీలు… ఈ పరిస్థితుల్లో థియేటర్లు నడిపే పరిస్థితి లేదని యజమానులు వాపోతున్నారు. గిట్టుబాటు కాకపోవడంతో చాలా థియేటర్లు మూతపడ్డాయి.