Somu Veerraju: బండి సంజయ్ అరెస్ట్ పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు.. డబ్బు సంపాదించాలనే..
నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని.. బీఆర్ ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు.

somu veerraju, bandi sanjay arrest (pics: twitter)
Somu Veerraju: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ (Bandi Sanjay Arrest) పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నానని, ముమ్మాటికి బీఆర్ ఎస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలకు బీజేపీ భయపడదని.. పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ లో అధ్యక్షుడి పాత్ర అనేది కుట్రగా వర్ణించారు. గతంలో ఇలానే చేసిన కుట్రలన్నీ హుష్ ఖానీ అయిపోయాయని అన్నారు. నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని.. బీఆర్ ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు.

Pawan Kalyan, Somu Veerraju (pic: @somuveerraju)
జనసేనతో కలిసే ఉన్నాం
విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పొత్తులో ఉన్నాం కాబట్టే తమ పార్టీ అధ్యక్షుడ్ని పవన్ కలిశారని చెప్పారు. తాము కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు కలిసి ఉద్యమిస్తామన్నారు. చంద్రబాబును కలిసినంత మాత్రాన పొత్తులో ఉన్నారంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Also Read: అర్థరాత్రి సమయంలో బండి సంజయ్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
విగ్రహ ధ్వంసంపై ఖండన
గుంటూరు జిల్లా ఫిరంగిపురం(Phirangipuram)లో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని సోము వీర్రాజు (Somu Veerraju) ఖండించారు. పురాతన మందిరాలపై ఈ ప్రభుత్వంలో ఎందుకు దఫదఫాలుగా దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రామతీర్ధం, అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీతో పాటు పలు ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు.
ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు
రాష్ట్రంలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని.. ఒక్కరినీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయమని అడిగితే తమపై అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. ఫిరంగిపురం (Phirangipuram) వినాయకుని విగ్రహం ధ్వంసంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. విగ్రహ ధ్వంసం ఘటనలో నిందితులను అరెస్ట్ చేయకుంటే కపిలతీర్దం నుంచి రామతీర్దం దాకా యాత్ర చేపడతామని హెచ్చరించారు.