AP Assembly : అసెంబ్లీలో స్పీకర్ ఏమోషనల్.. బాధతో నిద్ర పట్టడం లేదు

సభ ప్రారంభమైన దగ్గర నుంచి పదే పదే ఆందోళన చేస్తూ అడ్డుపడుతుండటంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం

AP Assembly : అసెంబ్లీలో స్పీకర్ ఏమోషనల్.. బాధతో నిద్ర పట్టడం లేదు

ap assembly

Updated On : March 23, 2022 / 2:30 PM IST

Speaker Thammineni Emotional : అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై స్పీకర్‌ తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు విజిల్స్, మరో రోజు భజన.. ఏంటీ పద్ధతి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వికృత చేష్టల్ని కంట్రోల్ చేయకపోతే ఎమ్మెల్యేలపై విశ్వాసం పోతుందన్నారు. సభ్యుల్ని సస్పెండ్ చేసిన రోజు తనకు నిద్ర పట్టదంటూ ఎమోషనల్‌ అయ్యారు తమ్మినేని. తాను ఎంత బాధపడుతున్నానో వాళ్లకేం తెలుసన్నారు. అసెంబ్లీ నడవడానికి రోజుకు రూ. 53 లక్షలు ఖర్చవుతుందని.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని స్పీకర్‌ ఆవేదన చెందారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. 2022, మార్చి 23వ తేదీ బుధవారం కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. బుధవారం, గురువారం టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More : Andhra Pradesh : ఏపీ EAPCET షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలివే

సభ ప్రారంభమైన దగ్గర నుంచి పదే పదే ఆందోళన చేస్తూ అడ్డుపడుతుండటంతో టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం సృష్టించారు టీడీపీ సభ్యులు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినలేదు. అధికార పార్టీ నేతలు మాట్లాడుతుండగా సభకు అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాసనసభ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన టీడీపీ సభ్యుల ప్రవర్తన అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీలో గత కొద్దిరోజులుగా టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్నారు స్పీకర్. చిడతలు వాయిస్తూ సభలో గందరగోళం సృష్టించడంతో.. ఐదుగురు టీడీపీ సభ్యులను రెండ్రోజుల పాటు సస్పెండ్ చేశారు స్పీకర్.