Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు
ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న 4 దేవాలయాలకు కుంభాభిషేకం, 12 దేవాలయాలకు జీర్ణోదరణ పనులు చేయాలని నిర్ణయించామని శ్రీనివాసులు చెప్పారు.

Srikalahasteeswara temple
Srikalahasti – Governing Council: శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి ఇవాళ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం పాలక మండలి ఛైర్మన్ శ్రీనివాసులు (Srinivasulu) వివరాలు తెలిపారు.
ముక్కంటి ఆలయానికి అనుబంధంగా ఉన్న 4 దేవాలయాలకు కుంభాభిషేకం, 12 దేవాలయాలకు జీర్ణోదరణ పనులు చేయాలని నిర్ణయించామని శ్రీనివాసులు చెప్పారు. అలాగే, స్వర్ణముఖి నదిలో మురికి నీరు చేరకుండా అడ్డుకట్ట వేస్తామని అన్నారు. టీటీడీ తరహాలో ముక్కంటి ఆలయంలోనూ ఆశీర్వాద మండపం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అలయ పైభాగంలో లీకేజీల నివారణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాసులు చెప్పారు. ఇందుకోసం దాతల ద్వారా లేదంటే ఆలయ నిధులతో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. అన్నదాన మండపాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ దర్శనానికి ఒక ప్రత్యేక సమయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.
Tirumala : శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్ లో మార్పులు