Strange Fish : వింత చేప.. మనిషి ముఖాన్ని పోలి ఉన్న ఫిష్
ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద జాలర్లు చేపల వేటకు వెళ్లగా ఈ బొంక చేప వలలో పడింది. టెట్రాంటిడీ కుటుంబానికి చెందిన ఈ చేప విషపూరితమైంది. ఈ చేపలో మనిషిని చంపేంత విషం ఉంటుంది.

Fish
Strange fish : కాకినాడలో ఓ వింత చేప మత్స్యకారుల వలకు చిక్కింది. చూడ్డానికి భయంగా.. రాక్షసంగా.. అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉన్న ఓ మత్స్యం వలకు చిక్కింది. ఈ చేప మామూలుగానే కనిపించినా.. ఎవరైనా తాకారా… తనలోని మరో వెర్షన్ చూపిస్తుంది. మనిషి ముఖాన్ని పోలిన రూపంతో ఉన్న ఈ చేపను బొంక చేపని పిలుస్తారు.
బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అంటూ రకరకాల పేర్లున్నాయి. నార్మల్‌గా నీటిలో ఉన్నప్పుడు మామూలు ఉండే ఈ చేప.. ఎవరైనా పట్టుకున్నా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బిపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ అరుదైన, వింత, విషపూరితమైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది.
New Fish Found: మాల్దీవుల కోరల్ రీఫ్ మాటున కొత్త చేపను గుర్తించిన శాస్త్రవేత్తలు
ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. ఈ బొంక చేప వలలో పడింది. టెట్రాంటిడీ కుటుంబానికి చెందిన ఈ చేప.. విషపూరితమైన చేప. ఈ చేపలో.. మనిషిని చంపేంత విషం ఉంటుంది.