ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ

Kadapa Red Sandal Smuggling : రెడ్ శాండల్‌పై దేశీయంగా నిషేధం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉన్నంత వరకూ స్మగ్లింగ్‌ను ఆపడం కష్టమనే వాదనలు ఉన్నాయి.
అయితే.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆటకట్టించడంలో తమ పరిధిలో అద్భుతంగా పని చేస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు చెప్తున్నారు.
కేంద్ర బలగాలను దింపడం, టాస్క్‌ఫోర్స్ పనితీరుపై ఆయన ప్రస్తావించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గతంతో పోలిస్తే స్మగ్లింగ్ తగ్గిందన్నారు.
నిఘా, కూంబింగ్ మరింత ఉధృతం చేశామని తెలిపారు. కేంద్ర బలగాల అవసరం లేదన్నారు. కేంద్ర బలగాలు వచ్చినా లోకల్ పోలీసులే గైడ్ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన బలగాలు ఉన్నాయిని టాస్క్ ఫోర్స్ ఎస్పీ పేర్కొన్నారు.
తమిళ కూలీల మృతిపై పౌర హక్కుల సంఘం సీరియస్ అయింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో తమిళ కూలీలు పావులుగా మారుతున్నారన్నారు పౌరహక్కుల సంఘం నేత ఒకరు చెప్పారు. కూలి డబ్బులు ఆశ చూపి స్మగ్లర్లు.. కూలీలను అడవులకు పంపుతున్నారన్నారని వాపోయారు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రధాన ముద్దాయిలు స్మగ్లర్లు తప్ప, కూలీలు కాదని స్పష్టం చేశారు. స్మగ్లర్ల ఆట కట్టిస్తే తమిళ కూలీలు అడవిలోకి వెళ్లడం ఆగిపోతుందని చెబుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి కూలీలు శేషాచల అడవుల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందన్నారు.